Categories

Search This Blog

క్షణ క్షణం


క్షణానికో క్షణం
నిను చూడాలని ఓ క్షణం
అనుకుంటాను అను క్షణం , అలా
నీ చేరువైన క్షణం , మాటలున్నా
ముఅగాబోతాను తక్షణం , మౌనాన్ని
జయించాలనే అనుకుంటాను ఆ క్షణం , కానీ
మౌనమే నన్ను జయిన్స్తుంది ప్రతి క్షణం ...
ఇలా క్షణ క్షణం అనుక్షణం నీ ప్రేమకేయి నిరీక్షణం

నీవే నీవే ....






కనులలో నీ రూపం

మనసులో నీ ధ్యానం

ఊహలలొ నీ సోయగం

శ్వాసలో నీ మౌనరాగం

అనువనువులో నీదైన ఒక అలజడి

ప్రతి అణువు నీకే అర్పితం అంటు స్వాగతాంజలి

చీకటంటే నాకు భయం నీ రూపం కనపడదేమోనని

ఉరుములంటే నాకు భయం నీ హృదయ స్పందన వినపదదేమోనని

వర్షమంటే నాకు భయం నాకు కనిపించకుండా నిన్నేక్కడ దాచేస్తుమ్దేమొనని

మరణం అంటే నాకు భయం మనిద్దరిని ఎక్కడ విడదీస్తుందోననని

అణువణువులో నీవే ప్రతి అణువులో నీవే

నా జీవం నీవే నా మరణం నీవే .....

నీవు...

చీకటిలో ఒక వెలుగు
అది నీ సౌందర్య ప్రకాసమేమోనని
నిస్యబ్దంలో ఒక అలజడి
అది నీ కాలి అందియుల సవ్వడి ఏమోనని
తన్మయత్వం చెందే ఒక స్పర్స
అది నీ వేడి నిస్వాసేమోనని
మౌనంలో మాటల హరివిల్లు
అది నీ మాటల చిరుజల్లెమోనని
ఇలా అనువనులో నిన్ను చూస్తూ
ప్రతి క్షణం నీ గూర్చి ఆలోచిస్తూ
చెప్పలేని ఊసులతొ
చెప్పాలని ఆశతో
నీ వైపే అడుగులు వేస్తూ
నిన్ను చేరాలనే దాహంతో
ఊపిరి లేకున్నా ఉప్పెన లా వస్తున్నా .....

స్వీట్ హార్ట్



Though, i cannot be there 
with you today
My thoughts are always with you
with warmest greetings

A moment with you
a joy for me.
A step with you
a gift for me.
A walk with you
a life for me.

ఒక హృదయం



నిన్ను చేరాలని
నిన్ను చూడాలని
నీతో మాట్లాడాలని
వెన్నెలలో విహరించాలని
తేనీటి జలకాలాడాలని
నీ చిటికిన వ్రేలు పట్టుకొని ప్రపంచాన్ని చూడాలని
సముద్రపు ఇసుక తిన్నేలపైయ్ నీతో సాగి పోవాలని
సముద్రపు అలల సవ్వడిని నీ తోడుగా ఆస్వాదించాలని
చిలిపి చేష్టలు చేసి నీతో పోట్లడాలని
అలసిన సమయంలో నీ వొడిలో సేద తీరాలని
నీవు నీను ఒక్కటిగా జీవించాలని మరణించాలని
కాంక్షిస్తూ ఆకాంక్షిస్తూ వేచిన ఒక హృదయం
 .....

ప్రేమ


చెప్పాలని వుంది కానీ చెప్పలేక పోతున్నా
కారణం అర్ధం చెప్పలేని పదం అది
వ్రాయాలని వుంది కానీ వ్రాయలేక పోతున్నా
కారణం వ్రాస్తే అర్ధం కానీ అక్షరాలు అవి
చూపించాలని వుండి కానీ చుపించలేకున్నా
కారణం చూపుకందని భావం అది
తాకాలని వున్నా తాకలేము
కారణం రూపులేని త్యాగం అది
తరతరాలకు తెలిసిన నిజం అది
కులమతాలను కాలరాసే ఖడ్గమది
ప్రపంచాన్నే జయించే శక్తి కలది

నీకు ...



నీ చిరు కోపమైన
నీ ధరహాసమైన
నీ చెమట భింధువైన
నీ కాలి ఆంధియైన
నిను తాకి నన్ను చేరు చిరుగాలి స్పర్సైన
నీకు చెందిన ఒక చిన్న ఊహైన చాలు
ఈ జీవితం నీకు అర్పించటానికి .....

మొదటసారి


మొదటసారి నిను చూసి

ఆశ్చర్య పోయాను కనులు మూసి

నీ సౌందర్యం వర్నిన్చుకున్నాను కవిత రాసి

నీ రూపం దాచుకున్నాను చిత్రం గీచి

బ్రహ్మా నిను సృష్టించాడ బంగారం పోతపోసి

మరియొక్క సారి కనిపించవా దయచేసి

నీ రూపం ప్రతిస్తిన్చుకుంటాను నా ప్రాణం పోసి

తాజ్మహల్ లో కళాత్మకత చూసాను

భగత్సింగ్ లో దేశభక్తి చూసాను

కోయల పాటలో కమ్మదనం చూసాను

ఇన్ని చుసిన చలించని నేను ,

నీ రూపమున ఏ సౌందర్య కిరణము నను తాకినదో కానీ

నీ ఆలోచనల అలజడులతో నిశ్చలత లేక నీ కొరకు వెతుకుచున్నాను ప్రియతమా

నా నేస్తం ....



ప్రతి ఓటమి ఒక గెలుపుకు పునాది
ప్రతి ముగింపు ఒక ఆరంభానికి అవకాసం
ప్రతి అడుగు ఒక ఆశకు సంకేతం
ఎన్నో ఆశలతో శ్వాస నిండా గెలచే ఉహలతో
విజ్ఞానం అనే ప్రయాణంలో నీతో కలిసాను
కులమతాలను కాలరాసి సహకారంతో సాగిన ఆత్మభందం
ఆస్తి పాస్తులను వదిలి అనురాగంతో నిండిన ఒక అమృతనిది
అనుమానపు అంచులు ధాటి నమ్మకంతో పురోగమించిన ఒక స్నేహభంధం
మనుషులం దురమవ్వచ్చు
మనసులు మమతలు కాదు
ఈ మజిలికి ముగింపు పలుకవచ్చు
మన మధ్య చిగురించిన స్నేహనికి కాదు


రాజకీయం?


జిత్తులు మారిన నక్కల నిలయం

విశ్వాసం లేని కుక్కల సమూహం

గడ్డిమేసే గాడిదల గుడారం

ధన దుర్గంధం కలిగిన పందులకది పన్నీటి జలం

గోడమీది పిల్లులై గాదె కింద పంది కొక్కులైన

రంగులు మార్చే ఊసరవేల్లులైన

సిగ్గుమాలిన బ్రతుకులకు అది ఓ దేవాలయం

ప్రజాస్వామ్యం,,,???


ప్రజల వలన ,ప్రజల చేత ,ప్రజల కొరకు ఏర్పడిన ప్రజాస్వామ్యం

ఇదేనా ఆ ప్రజా స్వామ్యం ???????

పదవి కోసం మామ పీక నొక్కిన వాళ్ళు

గాంధీ అని తోక తగిలించుకున్న పరాయి దేశపు గుంటనక్కలు

మతం ముసుగులో మారణహోమం చేసే మంత్రగాళ్ళు

పాలించె స్వరాజ్యం మన ప్రజాస్వామ్యం .

N.T.R పాలనే ద్వేయం అంటాడొకడు

ఇందిరమ్మ స్వరాజ్యం తెస్తానంటాడు ఇంకొకడు

పాకిస్తాన్తో యుద్ధం అంటాడు మరొకడు

పిడికెడు అన్నం పెట్టవయ్యా బాబు అంటే

కప్యుతరైజెసన్ చేస్తాను అంటాడొకడు

ఫ్రీగా కరెంటు ఇస్తానంటాడు ఒకడు

రామాలయం కట్టటమే మన ఆకలి అంటాడు ఇంకొకడు

పేదవాడు ఆకలితో చస్తుంటే

వెలుగుతోంది భారతదేశం వెలుగుతోంది అంటున్నారు

అవును నిజమే పేదవాడి చితిమంతల్తో వెలుగుతోంది

నాటి భోఫోర్సులు నేటి తెహల్కాలు

బాబ్రీ మసీదు- రామాలయం గొడవలు ఇవే ప్రజాస్వామ్య చరిత్రకు నిదర్శనాలు

నాడు ప్రాణం ధారపోసి ప్రజాస్వామ్యం సాధించారు మన మహాత్ములు

నేడు పదవి పొంది ప్రజాధనం దోచుకుంటున్నారు రాజకీయమాయకులు

దొంగలన్జకోడుకులసలె మసలే ఈ ధూర్త లోకంలో , అన్నాడు ఆ శ్రీ శ్రీ

డబ్బుకోసం పెళ్ళాన్ని తర్చే చేక్కగాల్ల సమూహం ఈ రాజకీయం అంటున్నాడు ఈ శ్రీ శ్రీ

నవ సమాజం ?


తల్లి ప్రేగు భంధం తలకొరివి కోసమా

విధ్యాబ్యాసన ఉద్యోగం కోసమా

మూడు ముళ్ళతో ఏడుఅడుగులు నడిచేది విడాకుల కోసమా

కాదు కాదు అలా జరుగరాదు

భారతీయ సంస్కృతిలో పుట్టింది ప్రాశ్చాత్య సంస్క్రుతికై అర్రుల చాచుట కోసమా

తెనేలోలేకిడి తెలుగులో పుట్టింది ఇంగ్లీషు మత్తులో వుగుట కోసమా

భారతావనిలో పుట్టి పెరిగింది డాలర్ నోటు కోసమా

కాదు కాదు అలా జరుగరాదు

స్వాతంత్ర్యం సంపాదించింది రాచరిక రాజకీయ పాలనా కోసమా

రాజకీయమున్నది వందనోట్ల కోటలకోసమా

ప్రజాస్వామ్యం ఇచ్చిన ఓటు వంద నోటు కోసమా

కాదు కాదు అలా జరుగరాదు

చేయీ చాచి వస్తున్నా చైతన్యం కోసం

చేయీ చేయీ కలపి సమిదలై పోరాడుదాం దేసప్రగతి కోసం

మన రక్తం తో నిర్మిద్దాం సిసలైన నవ సమాజం

మన భావితరాలకు అందిదాం నవ్యసమాజం