Categories

Search This Blog

నవ సమాజం ?


తల్లి ప్రేగు భంధం తలకొరివి కోసమా

విధ్యాబ్యాసన ఉద్యోగం కోసమా

మూడు ముళ్ళతో ఏడుఅడుగులు నడిచేది విడాకుల కోసమా

కాదు కాదు అలా జరుగరాదు

భారతీయ సంస్కృతిలో పుట్టింది ప్రాశ్చాత్య సంస్క్రుతికై అర్రుల చాచుట కోసమా

తెనేలోలేకిడి తెలుగులో పుట్టింది ఇంగ్లీషు మత్తులో వుగుట కోసమా

భారతావనిలో పుట్టి పెరిగింది డాలర్ నోటు కోసమా

కాదు కాదు అలా జరుగరాదు

స్వాతంత్ర్యం సంపాదించింది రాచరిక రాజకీయ పాలనా కోసమా

రాజకీయమున్నది వందనోట్ల కోటలకోసమా

ప్రజాస్వామ్యం ఇచ్చిన ఓటు వంద నోటు కోసమా

కాదు కాదు అలా జరుగరాదు

చేయీ చాచి వస్తున్నా చైతన్యం కోసం

చేయీ చేయీ కలపి సమిదలై పోరాడుదాం దేసప్రగతి కోసం

మన రక్తం తో నిర్మిద్దాం సిసలైన నవ సమాజం

మన భావితరాలకు అందిదాం నవ్యసమాజం

No comments:

Post a Comment